Mallu Bhatti Vikramarka: ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.. అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసు అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే సదుద్దేశం తో ఉన్నాము. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. మీ అభిప్రాయం ను తీసుకొని నిర్ణయం తీసుకుంటాము. రైతుకి న్యాయ బద్దంగా ధర్మంగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటాము.
Read also: Nalgonda Crime: ప్రాణం తీసిన స్నేహితులతో దిగిన ఫోటో.. నమ్మితే నట్టేట ముంచారు..
రైతుల అభిప్రాయాల్ని తీసుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది. ప్రజా పాలన తీసుకు రావడం కోసం మార్చి 16, 2023 లో పాద యాత్ర ప్రారంభం చేసి నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో యాత్ర చేసాను. ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసు అయినా అందరి అభిప్రాయం తీసుకుంటాము. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడ ల మధ్యనే నిర్ణయాలు మేము తీసుకోము. ప్రతి పైసా పెద వారికి అందాలనేది మా లక్ష్యం. మా మనస్సుల్లో ఏమి లేదు. కొండలు, గుట్టలు, ఫార్మ్ హౌస్ లు ఉన్న వారికి ఇవ్వాళ లేదా అనేది మీరే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో భూమికి సరైనా పత్రాలు కూడా లేవు. అసెంబ్లీ లో సైతం అందరి అభిప్రాయం తీసుకోని నిర్ణయం తీసుకుంటాము. పట్టాలు లేని వారు ఇతర సూచనలు తీసుకుంటామని తెలిపారు.
Pakistan : తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని మహిళ ముక్కు కోసిన కిరాతకుడు