హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ప్రారంభించిన పథకాల పైన చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్ పైన చర్చించామన్నారు. మిషన్ భగీరథ, కాలువలు తవ్వని అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించామన్నారు. అంతేకాకుండా.. 6 గ్యారెంటీల పథకాల కోసం సేకరించిన దరఖాస్తులు గురించి చర్చించామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ తమిళి సై ప్రమాణం…
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సీతక్క ఫొటోలతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. జువ్వలపాలెం రోడ్ లో రేవంత్ రెడ్డి, సీతక్క ఫ్లెక్సీలను పివిటి బ్రదర్స్ పేరుతో ఏర్పాటు చేశారు..
Mulugu Seethakka: ములుగులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి సీతక్క ఫోటోను అక్కడ స్పష్టంగా కనిపించేలా ప్రింట్ చేయాలని ఆరోపిస్తూ సోమవారం రాత్రి ములుగు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ అంకిత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభల్లో రేవంత్ పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు.
రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యే సీతక్కకు ఓయూ డాక్టరేట్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ ఛాన్సలర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్లర్ ప్రొ. తిరుపతిరావు పర్యవేక్షణలో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్ సైన్స్లో ఆమె పరిశోధన పూర్తి చేశారు.