టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు.
విశాఖే రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖకు ఫిఫ్ట్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించారు.
టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైజాగ్‌లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వారికి వ్యతిరేకంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసింది జేఏసీ.. అయితే, పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించారు.. మా కడుపు కొడతామంటే ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరుతో మా…
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్ మీడియాలో ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల…
మోడీ బర్త్ డే రోజున 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక చేస్తున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యం కి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు 5 కోట్లు పోస్ట్ కార్డులతో కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. మోడీ జన్మదిన వేడుకలను 20 రోజుల పాటు రోజుకో ప్రాధాన్యతా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్వచ్చ భారత్, మన్ కీ…
శ్రీకాకుళం బందరువానిపేటలో పర్యటించారు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా బోటు బోల్తా ఘటనలో మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు అప్పలరాజు, ధర్మాన. మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఐదులక్షల చొప్పున చెక్కులు అందించారు. మత్స్యకారులకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాలకు ప్రతిపాదనలు…