Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్‌లో దొరికిపోయినట్లయింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడు అంటూ ఆయన ప్రశ్నించారు. తన సంపదను తాను సృష్టించుకోవడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు మాయా ప్రపంచాన్ని సృష్టించాడు.. అది ఒక పెద్ద స్కాం అని మంత్రి ఆరోపించారు. తాత్కాలిక సెక్రటేరియట్‌కే వెయ్యి కోట్లు పెట్టారంటే ఎవరూ నమ్మలేరన్నారు. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం అని సాక్షాత్తు ప్రధాని మోడీనే చెప్పారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
Also Read: Asaduddin Owaisi : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్ బిడ్డింగ్ ట్రాన్స్ కోయ్ సంస్థకి వస్తే వాటిని తప్పించి నవయుగకు ఇచ్చేశాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇప్పుడు దొరికిపోయిన దొంగ… అందుకే కిక్కుమని మాట్లాడటం లేదని మంత్రి ఆరోపణలు చేశారు. ఐటీ సెంట్రల్ శాఖ నోటీస్‌లు ఇస్తే.. ఇక్కడ పరిధిలో ఉన్నవారితో నోటీసులు ఇప్పించండి అంటున్నాడని.. సిగ్గుందా చంద్రబాబుకు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇప్పటికీ వ్యవస్థలో ఉన్న సంస్థలను మేనేజ్ చేస్తున్నాడు తప్ప సమాధానం చెప్పటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు ఐటీ నోటీసులపై స్పందించవూ.. నువ్వు సపోర్ట్ చేసిన గవర్నమెంట్‌లో జరిగిన అవినీతి ఇది అని మంత్రి ప్రశ్నించారు. మీరంతా తోడు దొంగల్లా.. నువ్వు ప్యాకేజ్ తీసుకోకపోతే నీ యజమానిని నువ్వు ప్రశ్నించు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ స్పందించక పోతే.. ఆయనకు, చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో అర్థమవుతుందన్నారు.
Also Read: Vijay Deverakonda: యాదాద్రిలో దేవరకొండకి షాకిచ్చిన లేడీ ఫ్యాన్.. వామ్మో ఇలా ఉన్నారేంటి?
సడెన్‌గా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం.. ఎన్టీఆర్ పేరిట చెల్లని కాయిన్ రిలీజ్ చేయటం ఒక స్పాన్సర్ ప్రోగ్రాం ఆని ఇపుడు అర్థమయిందన్నారు. బీజేపీ వాళ్లు చంద్రబాబును దగ్గరకు రానివ్వటం లేదని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ వాళ్ల శరణు కోరడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని ఆయన ఆరోపించారు. అధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగజారిపోతాడని ఆయన విమర్శించారు. విజన్ 2047 అనే ప్రోగ్రాంను చంద్రబాబు పెట్టాడని.. ఆయనకున్న ముగ్గురు ఎంపీల బలంతో నువ్వు భారత్‌ను ముందుకు తీసుకెళ్తావా అంటూ ప్రశ్నించారు. నీ విజన్ 2020, నీ విజన్ 420 అన్ని చూశామని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు విచారణకు అర్హుడు..14ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయని.. వాటిపై విచారణ చేపట్టి జైలులో పెట్టాలన్నారు.