AP CMO Serious On Minister Seediri Appalaraju: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది. మాటలు జాగ్రత్త అంటూ తీవ్రంగా స్పందించింది. ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేసేముందు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. నేతల స్థాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నాం? అనే దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సీరియస్ సీఎంఓ సీరియస్ అయ్యింది. ఇదే విషయాన్ని సీఎంవో వర్గాలు సైతం అనధికారికంగా కన్ఫమ్ చేశాయి.
MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు
కాగా.. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా? అని ప్రశ్నించారు. ఓ కోశానైనా జాతీయవాదం ఉందా? అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ వాదులేనని.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రానికి నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో పనికిరావంటూ కామెంట్ చేశారు.
CM Jagan Mohan Reddy: గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష.. వాటిని తిప్పికొట్టాలంటూ సూచన
అంతేకాదు.. ఆంధ్రా ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప, అక్కడ ఏమీ ఉండదని సీదిరి అప్పలరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తరహాలో ఏపీలో లిక్కర్ స్కామ్‌లు లేవని కూడా పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే బిడ్ వేస్తామంటావా? దానర్థం ప్రైవేటీకరణకు నువ్వు అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఇవే కాకుండా.. ఇంకా రాయకూడని భాషలో చాలా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎంఓ స్పందించి, ఇకపై ఇలాంటి పరుష వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.