Seediri Appalaraju House Arrest: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో, పలాసలో జీడి వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిష్టు గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం…
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు.
ఆ నియోజకవర్గంలో రాజకీయం యమా రంజుగా మారుతోందట. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందట. తగ్గేదే లే అన్నట్టుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రక్తి కట్టిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. సవాళ్ళు సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదిరి…
విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.