Seediri Appalaraju House Arrest: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో, పలాసలో జీడి వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిష్టు గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు సిద్ధమైన అప్పలరాజును పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం.. ఓ కేసు విషయమై విచారణ కోసం వచ్చాం అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. సంబంధం లేని కేసుల్లోనూ వైసీపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న విషయం విదితమే..
Read Also: Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!