Off The Record : పలాసలో హాట్ హాట్ పాలిటిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో రాజకీయం యమా రంజుగా మారుతోందట. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందట. తగ్గేదే లే అన్నట్టుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రక్తి కట్టిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. సవాళ్ళు సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయన్నది లోకల్ టాక్. తమ పార్టీ పవర్‌లోకి రాగానే ఆపరేషన్ అప్పలరాజు చేపట్టారట శిరీష. ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు, అక్రమాలను నిగ్గుతేల్చే పని మొదలుపెట్టినట్టు చెప్పుుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు కేసులు బుక్ అయ్యాయి ఆయన మీద. ఆ రెండూ గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శిరీష హెచ్చరించినవే కావడంతో… రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది.
అలాగే… సీదిరి అనుచరుల మీద కూడా దృష్ఠి సారించారట ఎమ్మెల్యే. అదే సమయంలో మాజీ మంత్రి కూడా ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు. సై అంటే సై అనాల్సిందేనంటున్నారట ఆయన. త్యాగాలకు సిద్ధంగా ఉండమంటూ తన అనుచరులకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. తమ హయాంలో ఐదేళ్ళలో ఒక్క కేసుకూడా గౌతు శిరీషపై నమోదవలేదని, ఆమె మాత్రం అధికారంలోకి రాగానే… రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేపారని అంటున్నారట. తమను ఏదో కేసులో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అన్నిటికీ సిద్ధమంటూ సవాల్ విసురుతున్నట్టు తెలిసింది. మందస, వజ్రపుకొత్తూరు , పలాస మండలాల్లో తమ ప్రధాన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని, అయినా భయపడేది లేదని అంటున్నారట సీదిరి. అలాగే తాను అవినీతి, అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే…దేనికైనా సిద్ధమంటున్నట్టు తెలిసింది. ఇలా ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పలాస రాజకీయం యమా హాట్‌గా మారుతోంది.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!