సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా దు:ఖంలో ఉంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
ప్రమఖ జర్నలిస్టు వినోద్ దువాపై దాఖలైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం…