వంది మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న హర్యానాలోని సిర్సా జిల్లాలో ఆందోళన నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. మొదట రైతులపై దేశద్రోహంతో పాటు హత్యాయత్నం కింద అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. రైతు సంఘాల నేతలు హర్‌చరన్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ పేర్లు ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు.. అయితే, తాజాగా వంద మంది రైతులపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్టు రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, సెక్షన్ 124-ఏపై తాజాగా స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని.. కొయ్యను మలిచే రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్లుంది.. అంటూ వ్యాఖ్యానించిన కొన్ని గంట్లోనే ఈ కేసులు వెలుగు చూశాయి.. హర్యానాలోని రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వ సూచనల మేరకు రైతులు మరియు రైతు నాయకులపై తప్పుడు, పనికిరాని ఆరోపణలతో దేశద్రోహ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు రైతు సంఘాల నేతలు.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు