Rajasthan: ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు భర్తలపై అక్రమ గృహహింస కేసుల పెట్టి వేధిస్తున్నారు. దీంతో పలువురు మగాళ్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇందుకు మంచి ఉదాహరణ. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌కి చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కూడా తన భార్య నుంచి ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తప్పుడు కేసులో విసిగిపోయిన కృష్ణ వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నాడు.
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్‌వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
Bengaluru Techie Suicide: బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Atul Subhash Suicide: భార్య, అత్తమామల క్రూరత్వం కారణంగా 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపుల కేసులో తనను ఇరికించారని, భార్య, ఆమె కుటుంబం వేధిస్తుందని చెబుతూ ఆయన ఆత్మహత్య చేసుకున్న తీరు అందర్ని కంటతడి పెట్టిస్తోంది.