డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీహోమంలో పాల్గొన్నారు.
ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇనుమడింపజేసేలా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని కేసీఆర్ అన్నారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలను సీఎం కేసీఆర్ తెలిపారు.
రేపు ( ఆదివారం ) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అత్యంత కీలకమైన ఫైల్ మీద తన మొదటి సంతకం చేయనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్నారు.
మరికొన్ని గంటల్లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. దీంతో నూతన సచివాలయానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్ లో 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేయనున్నారు.
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన…
సెక్రటేరియట్ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు కేసీఆర్. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల…
మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. నిధుల సమీకరణకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది సీఆర్డీఏ. మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతమున్న మూడు చట్టాలను రద్దు చేశామని.. తిరిగి సమగ్రంగా కొత్తగా తీసుకొస్తామని స్పష్టం చేసింది…
నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం…