రేపు ( ఆదివారం ) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అత్యంత కీలకమైన ఫైల్ మీద తన మొదటి సంతకం చేయనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలు మీద నూతన సచివాలయంలో కేటీఆర్ తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ‘నాన్న’ సినిమాలో కూతురిగా నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి రేపు ( ఆదివారం ) మంత్రి కే. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలు పైన మంత్రి కేటీఆర్ తొలి సిగ్నిచర్ చేయనున్నారు.
Also Read : Drug-Resistant Bacteria: షాకింగ్ స్టడీ.. ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు..
హెచ్ఐసీసీలో జరిగినఫుడ్ కాంక్లేవ్-2023 ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. తెలంగాణ సంక్షేమ, అభివృద్ది పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ స్టేట్ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతున్నదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మత్య్స సంపదలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.