CM KCR: ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Telangana: తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందించే గ్రీన్ యాపిల్ అవార్డులను రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలు అందుకున్నాయి.
CM KCR: తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR: జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Traffic restrictions: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం (రేపు) సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు.
CM KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Somesh Kumar: ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Telangana martyrs memorial: జూన్ నెలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు! తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించే ఈ భవనాన్ని పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు.