గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్వర్వుల ప్రకారం.. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకోనున్నారు.. మిగతా 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారులు చెబుతున్నమాట.. ఇక, పెరిగిన వేతనం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్లు.. అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగించాలనే నిబంధనలు ఉన్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు.. తద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించిన విషయం విదితమే.