డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్, హెచ్వోడీలుగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి హెచ్ఆర్ఏ (HRA)ను పెంచింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 24 శాతం హెచ్ఆర్ఏ పెంచారు. రూ.25 వేలకు మించకుండా పెంచిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.
రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీలో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు.
TS State Emblem: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత..
ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది.
సచివాలయంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ నెల చివరిన లేదా వచ్చే నెలలో…