బీహర్‌లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది.