తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి, గతంలో ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, కొంత విరామం తర్వాత, మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు పోసాని. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పోసాని కృష్ణమురళి కొత్త చిత్రంతో రంగంలోకి దిగుతున్నారు. Also Read:Jyothi Krishna:…
భారతదేశంలో విశ్వవిఖ్యాత దర్శకసార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యజిత్ రే మాత్రమేనని అందరూ అంగీకరిస్తారు. సత్యజిత్ రే సినిమాలతోనే భారతీయ ఆత్మ దేశవిదేశాల్లోని సినీప్రియులను ఆకట్టుకుంది. ‘రే’ పేరులో వెలుగు రేఖ ఉన్నట్టే, ఆయన ప్రతిభాపాటవాల కారణంగానే భారతీయ సినిమా ప్రపంచ యవనికపై వెలుగు చూసింది. ఏం, అంతకు ముందు సత్యజిత్ రే కంటే మించిన దర్శకులు లేరా? అంటే నిస్సందేహంగా లేరనే చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో దర్శకులు అఖండ విజయాలను సాధించారు. అయితే…
తన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని తపించేవారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. మహానటుడు యన్టీఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. యన్టీఆర్ తనయుడు, ప్రముఖ…
అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో…
(ఆగస్టు 18న గుల్జార్ పుట్టినరోజు) సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. అంతలా అలరించిన గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. గుల్జార్ అన్నది…