Jayanthi : దర్శకసార్వభౌముడు సత్యజిత్ రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో విశ్వవిఖ్యాత దర్శకసార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యజిత్ రే మాత్రమేనని అందరూ అంగీకరిస్తారు. సత్యజిత్ రే సినిమాలతోనే భారతీయ ఆత్మ దేశవిదేశాల్లోని సినీప్రియులను ఆకట్టుకుంది. ‘రే’ పేరులో వెలుగు రేఖ ఉన్నట్టే, ఆయన ప్రతిభాపాటవాల కారణంగానే భారతీయ సినిమా ప్రపంచ యవనికపై వెలుగు చూసింది. ఏం, అంతకు ముందు సత్యజిత్ రే కంటే మించిన దర్శకులు లేరా? అంటే నిస్సందేహంగా లేరనే చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో దర్శకులు అఖండ విజయాలను సాధించారు. అయితే వారి చిత్రాలలో కనిపించిన బాణీ అంతర్జాతీయ విలువలకు అంతగా తూగలేదు. అందువల్లే సత్యజిత్ రే రాకతోనే భారతీయ సినిమా సైతం అంతర్జాతీయంగా ఆకట్టుకోగలదని నిరూపితమయింది. సత్యజిత్ రే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత దర్శకులెందరికో అమిత గౌరవం.
సత్యజిత్ రే 1921 మే 2న కలకత్తాలో జన్మించారు. ఆయన వంశంలో అందరూ కళాకారులే. ముఖ్యంగా చిత్రలేఖనంలో చేయి తిరిగిన వారు. సత్యజిత్ రేకు కూడా చిత్రలేఖనంలో ఎంతో ప్రావీణ్యం ఉంది. శాంతినికేతన్ లో అధ్యయనం చేయడం వల్ల సత్యజిత్ రే కు లలితకళల పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఆర్ట్ తోనే ఆయన జీవితం ఆరంభమయింది. ఆ నాడు కలకత్తాలో ప్రచురితమైన పలు పత్రికలలో రే రేఖాచిత్రాలు ఆబాలగోపాలాన్నీ అలరించాయి. సత్యజిత్ రే కు సినిమా అంటే ప్రాణం. పాశ్చాత్య చిత్రాలను చూసి, సినిమాలపై మోజు పెంచుకున్న సత్యజిత్ రే, తన మిత్రులతో కలసి కలకత్తాలో ఫిలిమ్ సొసైటీ ఏర్పాటు చేశారు. అదే సంస్కృతి తరువాతి రోజుల్లో ఇతర రాష్ట్రాలలోనూ పెంపొందింది. ఎందరో పాశ్చాత్య దర్శకులను అధ్యయనం చేశారు రే. యాడ్ ఏజెన్సీలో పనిచేసే రోజుల్లో తప్పకుండా ఏదో ఒక సినిమా చూసేవారు. ఇక విదేశాలకు వెళ్ళినప్పుడు రోజుకో సినిమా చూశారు. వాటి స్ఫూర్తితోనే స్వదేశం రాగానే ‘పథేర్ పాంచాలి’కి రూపకల్పన చేశారు. పలు పాట్లు ఎదుర్కొని చివరకు బెంగాల్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ‘పథేర్ పాంచాలి’ వెలుగు చూసింది. రాగానే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలచింది. పలు విదేశీ వేదికలపైనా ఉత్తమ చిత్రంగా గెలిచింది. ఆ తరువాత రే రూపొందించిన “అపరాజితో, అపూ సంసార్” అనే మరో రెండు చిత్రాలతో ‘అప్పు ట్రయాలజీ’ అంతర్జాతీయ సినిమా అభిమానుల విశేషాదరణ చూరగొంది. అప్పటి నుంచీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎందరో దర్శకులు ఈ సారి సత్యజిత్ రే నుండి ఏ సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే ప్రతీసారి సత్యజిత్ రే అంతర్జాతీయ యవనికపై వెలుగులు విరజిమ్మే చిత్రాలనే అందించేవారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకుంటున్న హాలీవుడ్ డైరెక్టర్ క్రిష్టఫర్ నోలాన్, గ్రాఫిక్ మాయాజాలంతో యావత్ ప్రపంచాన్నీ తమవైపు తిప్పుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్, జార్జ్ లుకాస్, ‘గాడ్ ఫాదర్’ సీరిస్ తో సినీఫ్యాన్స్ ను విశేషంగా మురిపించిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, విఖ్యాత సంచలన దర్శకుడు మార్టిన్ స్కార్సెసే వంటి వారందరూ తాము సత్యజిత్ రే సినిమాలతో స్ఫూర్తి చెందామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇక సత్యజిత్ రే సమకాలికులైన విఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా, “రే చిత్రాలను చూడనివారు సూర్యుని కింద ఉండీ ఫలితం లేనివారే” అని శ్లాఘించారు. దీనిని బట్టే ప్రపంచ వ్యాప్తంగా సత్యజిత్ రేకు ఉన్న కీర్తి ఏ పాటిదో అర్థమవుతుంది. నవతరం దర్శకులు సైతం సత్యజిత్ రే చూపిన బాటలో సాగుతూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!