Rajnath Singh: చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజింగ్ రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్‌జున్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు.
Ajit Doval: బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా అంశాలపై పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని ఉందని ఆయన స్పష్టం చేశారు. మే 7న భారత్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. పహల్గామ్…
Kartarpur Sahib Corridor Agreement: ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ SCO సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై భారత్ – పాకిస్తాన్ తమ ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్ల పాటు పొడిగించాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిక్కు యాత్రికులకు ఇది నిజంగా శుభవార్త. ఈ దౌత్య నిర్ణయం కారిడార్ నిరంతర ఆపరేషన్‌కు మార్గం సుగమం చేస్తుంది. ఇది పాకిస్తాన్‌లోని…
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ…
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నారు.
Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో నిరసనలకు ప్లాన్ చేశారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు.
దాదాపు పదేళ్ల తర్వాత భారత్‌కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది.