Pakistan: కజకిస్తాన్ వేదికగా ఎస్‌సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ పాకిస్తాన్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, ఈ ఆఫర్లను పాక్ ఉపయోగించుకుంటుందా..? లేదా..? అనేది ప్రశ్న.
S Jaishankar: కజకిస్తాన్ వేదికగా ఆస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్‌కి భారతదేశం తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో భేటీ అయ్యారు.
కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కలవనున్నారు.
SCO summit: వచ్చే వారం కజకిస్తాన్ ఆస్తానాలో జరగబోయే ‘‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)’’ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
వచ్చే నెలలో కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు ప్రధాని మోడీ దూరం అయ్యారు. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. భారత ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి నాయకత్వం వహించనున్నారు .
PM Modi: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, సీమాంత ఉగ్రవాదానిక మద్దతు ఇచ్చే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.
India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..?…
SCO Summit: ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది.…
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.