Ajit Doval: బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా అంశాలపై పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని ఉందని ఆయన స్పష్టం చేశారు. మే 7న భారత్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన ఘటన నేపథ్యంలో ఆ దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.
Read Also: Donald Trump: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన పోస్ట్
అజిత్ దోవల్ శాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనడానికి చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సంబంధాలపై అనేక అంశాలను చర్చించారు. ఇరు దేశాల మధ్య జరిగిన అనుభవాలను చర్చించడమే కాకుండా, పరస్పర విశ్వాసాన్ని అందించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇరు పక్షాలు చర్చించాయి. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) వెల్లడించింది.
Read Also:Operation Sindhu: ఇరాన్ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!
మరోవైపు, చైనా-భారత్ సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, ఏవైనా కీలక అంశాలను చక్కబెట్టుకోవడం ద్వారా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పగలమని చైనా రాయబారి శూ ఫెహాంగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘‘డ్రాగన్ (చైనా), ఏలిపెంట్ (భారత్) కలిసి నాట్యం చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయి’’ అంటూ చైనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సమావేశంలో దోవల్ మాట్లాడుతూ.. మల్టీలాటరల్ వ్యవస్థల్లో చైనాతో సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని, SCO చైర్మన్ గా చైనా చేపట్టిన కార్యక్రమాలను భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు.