హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు…
కరోనా థర్డ్ వేవ్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ విరుచుకుపడింది.. దీంతో.. కఠిన ఆంక్షల బాటపట్టింది ఆ రాష్ట్రంలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సర్కార్.. అయితే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఇప్పటికే పలు సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో.. నేటి నుంచి ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోబోతున్నాయి.. మొదటి దశలో 9 నుంచి 12 తరగతుల వరకు ఆన్‌లైన్,…
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. Read Also:…
సంక్రాంతి సెలవులు, కరోనా నిబంధనల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవాళ్టి నుంచి తెరుచుకుంటున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల సంక్రాంతి సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. మళ్లీ వాటిని తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో…
కరోనా విజృంభణతో కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, కర్ణాటకలోనూ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం.. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో పడిపోయారు.. రేపటి…
కరోనా కారణంగా జనవరి 8 నుంచి జనవరి 16 వరకు, ఆ తరువాత సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నది. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా…
కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30)…
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. కోవిడ్ దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు మూతపడ్డాయి.. మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నా.. విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి.. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి.. అయితే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారినపపడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీనిపై ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విద్యార్థులు,…
కరోనా థర్డ్‌వేవ్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక, స్కూళ్లపై పంజా విసురుతోంది మహమ్మారి.. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల తర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి…