టీచర్ల ప్రమోషన్స్, బదిలీ లు, పాఠశాలల పునః ప్రారంభం పై సీఎంతో మాట్లాడాము అని తెలిపారు పిఆర్టియూ నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు. స్కూల్స్ ,జూనియర్ కళాశాలల ప్రత్యక్ష తరగతులు తాత్కాలిక వాయిదాకు సీఎం హామీ ఇచ్చారు అన్నారు. గతంలో మాదిరిగానే స్కూల్స్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు జరుగుతాయని… పరిస్థితిలు చక్కబట్టాకే ప్రత్యక్ష తరగతులు ఉంటాయని తెలిపారు. ఇక 50 శాతం టీచర్ల తోనే పాఠశాలలు ప్రారంభమవుతాయని… కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు,…
కెనడాలో చిన్నారుల అస్తిపంజరాలు భయపెడుతున్నాయి. గత నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని మూసిఉన్న పాఠశాలలో దాదాపుగా 200లకు పైగా అస్తిపంజరాలు బయటపడగా, తాజాగా వాంకోవర్‌లోని మూసిఉన్న ఓ పాఠశాలలో 600లకు పైగా అస్తిపంజరాలు బయటపడ్డాయి. దీంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రత్యేక రాడార్ వ్వవస్థను ఏర్పాటు చేసి మూసిఉన్న పాఠశాలలో సెర్చ్ చేస్తున్నారు. గతనెలలో ప్రఖ్యాత కామ్‌లూన్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 215 అస్తిపంజరాలు బయటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. Read: ప్రకాష్ రాజ్ కి…
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 19 వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. జులై 1 వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. Read: ప్రామిసింగ్ గా ‘హీరో’ టీజర్! పాఠశాలల…
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ్టితో స్కూళ్లకు వేసవి సెలవులు ముగియగా.. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సిఉంది.. విద్యార్థులు స్కూళ్లకు రారు కానీ, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంది.. కానీ, ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది.. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డైట్ కాలేజీలకు కూడా 15 వరకు సెలవులు పొడిగించారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల…
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలిపే విధంగా…