Uttara Pradesh School Closed: ఉత్తరప్రదేశ్ లో రెండో తరగతి చదువున్న ముస్లిం విద్యార్థిని ఓ టీచర్ ఇతర పిల్లలతో కొట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎక్కాలు సరిగా చెప్పలేదని తోటి విద్యార్థులతో కొట్టించినట్లు టీచర్ తెలిపింది. అయితే ఆమె అసభ్యంగా మాట్లాడిన మాటలు, మతం గురించి ప్రస్తావించడం వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యాశాఖ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది.…
ఏపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. విజయనగరం లో ఓ స్కూల్ టీచర్ ను అతి దారుణంగా చంపిన ఘటన వెలుగు చూసింది.. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాజాం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాజాంలో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.…
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే వారితో నీచంగా ప్రవర్తించాడు. ఓ పాఠశాలలో బాలికలకు అశ్లీల వీడియో చూపించడంతో పాటు వారిని అనుచితంగా తాకుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్.
Viral Video Of Girl Crying: ఇటీవల సోషల్ మీడియా ద్వారా కొందరు ఓవర్ నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అయితే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్కూలులో టీచర్ రైమ్స్ చెప్తుంటే ఓ చిన్నారి మాత్రం ఫన్నీగా స్పందిస్తోంది. ఈ రైమ్‌లో భాగంగా టీచర్ కొన్ని పనులు చేయాలని చెబుతుంటే…
గృహహింస కేసుల్లో చాలా సందర్భాల్లో మహిళలే బాధితురాలుగా ఉంటారు. వరకట్న వేధింపులు కావచ్చు, ఇతర కారణాలతో భార్యలను హింసిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులను ఇప్పటి వరకు చాలానే చూశాం. కానీ రాజస్తాన్ లో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తపై గృహహింసకు పాల్పడుతోంది. చాలా ఏళ్లుగా తనను హింసిస్తుందంటూ కోర్ట్ లో కేసు పెట్టాడు. వింతగా ఉన్న ఈ కేసు రాజస్తాన్ ఆల్వార్ జిల్లా భీవాడీలో చోటు చేసుకుంది. కోర్ట్ లో భార్యపై గృహహింస కేసుపై కోర్టును…
పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో వుండి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది టీచర్లు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో చిల్లగుండ్ల పల్లెలో సైకో ఉపాధ్యాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో టిచర్ గా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి,లైంగికంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు అబు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి…
దేశవ్యాప్తంగా కొన్ని రోడ్లు బాగానే ఉన్నా.. మరికొన్ని రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి.. ఇక, ఈ మధ్య కురిసిన వర్షాలకు ఉన్న రోడ్లు కొన్ని కొట్టుకుపోతే.. మిగిలిన రోడ్లు దారుణంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు…