పల్నాడు జిల్లాలో స్కూలు వివాదం రాజకీయ రంగు పులుముకుంది…. గురజాల మండలం మాడుగుల జడ్పీ హైస్కూల్లో టీచర్లు లేరంటూ విద్యార్థుల ఫిర్యాదు చేస్తే అధికారులు దాన్ని కామ్ గా పరిష్కారం చేయాల్సింది పోయి ప్రభుత్వానికి చిక్కుముడి చేసి పెట్టారు…. అధికారుల అతి తెలివితో ఉన్న టీచర్ని పీకేసి విద్యార్థులకు కొత్త సవాలు విసిరారు ….దీంతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగిన పరిస్థితి…. ఈ విషయం కాస్త ఇప్పుడు రాజకీయ మలుపులు తిరుగుతోంది.
కొండనాలుకకు మందు వేయమంటే ఉన్న నాలుక పీకేసిన పరిస్థితి పల్నాడు జిల్లాలో ఏర్పడింది. పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ హైస్కూల్లో టీచర్స్ లేరంటూ విద్యార్థులు చేసిన ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ రంగు పులుము కుంది…. విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో గుర్రుగా అధికారులు అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే అందులో ఒకరిని పీకేశారు. దీంతో విద్యార్థులను రోడ్డు ఎక్కేలా చేసి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అధికారులు అటుఫీకి ఇటులాగి అది ఇప్పుడు ప్రభుత్వ తప్పుగా తేల్చేశారు అధికారులు ….ఇంకేముంది అటు ప్రతిపక్షాలకి ఇటు విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వం మీద అక్కసు వెళ్లగక్కే పరిస్థితి కల్పించారు.
వాస్తవానికి ఓ స్కూల్లో టీచర్లు లేకపోతే అది ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదు…. జిల్లాస్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు… పక్కనున్న స్కూల్ నుంచి టీచర్లను సర్దుబాటు చేయడం, లేక రెగ్యులర్ బదిలీల్లో భాగంగా ఆ ప్రాంతానికి టీచర్లను నియమిస్తే వ్యవహారం అంతటి తో సద్దుమణిగేది…. అలా కాదని విద్యార్థులు చేసిన ఫిర్యాదును తమ గౌరవానికి భంగం కలిగించేదిలా అధికారులు భావించి గతంలో ఇదే స్కూల్లో ఉన్న హెడ్మాస్టర్ తొలగించారు. దీనికి కారణం వేరే అని చెప్పినా విద్యార్థులు ఫిర్యాదు చేసే వరకు ఎందుకు తీసుకొచ్చారు అనేది అధికారులు భావన…
పోనీ సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుడి స్థానంలో మరో ఉపాధ్యాయుని నియమించడం లేదా విద్యార్థులు కోరినట్లుగా అన్ని క్లాసులకు ఉపాధ్యాయులను నియమించడం వంటివి చేస్తే మళ్లీ విద్యార్థులు రోడ్డెక్కి పరిస్థితి వచ్చేది కాదు… అలా కాదని అధికారులు ఆగ్రహంతో ఊగిపోయి విద్యార్థులు చేసిన నిరసనను వ్యక్తిగత ప్రతిష్ట కోల్పోయినట్లుగా భావించి గడిచిన 10 రోజులుగా ఒకే మాస్టర్ తో పిల్లలకు పాటలు బోధించేలా అధికారుల నిర్ణయాలు ఉండటంతో విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా రంగ ప్రవేశం చేశాయి.
విద్యార్థులు స్కూల్ నుండి 8 కిలోమీటర్ల దూరం ఉన్న గురజాల తాహసిల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి తమ నిరసన తెలిపే అంతవరకు అధికారులు ఏం చేస్తున్నారనేది అసలు ప్రశ్న? ఇది అధికారులు చేసిన తప్పిదమైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ వ్యాఖ్యలు చేసే పరిస్థితి కి విషయం వచ్చింది. తీరా ఎంత జరిగిన తర్వాత స్కూళ్లకు వెళ్లిన అధికారులు పిల్లలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా బెదిరింపు చర్యలకు పాల్పడటంతో ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నారు.
స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ,అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు అయినా ఈ విషయాన్ని ఇంతటితో సర్దుబాటు చేస్తే బాగుంటుందని లేదంటే ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి ప్రభుత్వ తప్పుగా తేల్చేసి ప్రజల్లో చులకన చేయటం సరైన విధానం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ….మరి దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తే విషయం రాజకీయ రంగు పూలుముకోకుండా ఉంటుంది…. లేదంటే అధికారులు చేస్తున్న తప్పులకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెండ్ల సౌజన్యంతో)