Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan OTT Release: థియేటర్లలో విజయ్ తలపతి చివరి సినిమాగా భారీ హైప్ తెచ్చుకున్న ‘జన నాయగన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ రిలీజ్‌పై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది? హిందీ వెర్షన్ పరిస్థితి ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి కెరీర్ లో ‘జన నాయగన్’ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో మూడో వారాంతానికి చేరుకున్నా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జులై 23 న థియేటర్లలో అడుగు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినప్పటికీ, సుమారు ₹350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, పలు థియేటర్లలో ప్రదర్శన నిలిచిపోవడం కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను పలకరించేందుకు వస్తోంది.
Also Read
- Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
- దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
- Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
సాధారణంగా దక్షిణాది సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కావడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే థియేటర్లలో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న సినిమాలకు మాత్రం ఓటీటీ విడుదల విషయంలో నిర్మాతలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా హిందీ వెర్షన్‌ను వేరే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చే అవకాశం ఉంటుంది.
‘జన నాయగన్’ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 21న జీ5లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులు ఇంటి నుంచే విజయ్ చివరి సినిమాను చూసే అవకాశం లభిస్తుంది. అయితే హిందీ ప్రేక్షకులకు మాత్రం కొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు. ‘జన నాయగన్’ హిందీ వెర్షన్ జీ5లో కాకుండా మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో పేరు కూడా వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ పై చిత్రబృందం ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిఉంది.
థియేటర్లలో విజయ్ చివరి సినిమా మిస్ కాకుండా చూసుకున్న అభిమానులు, ఇప్పుడు అదే సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 21న జీ5లో స్ట్రీమింగ్ అనే వార్త ఆఫీషియల్ గా ఖరారైతే, దక్షిణాది భాషల్లో డిజిటల్ ప్రేక్షకులకు మరోసారి ‘జన నాయగన్’ సందడి మొదలుకానుంది. ఇక హిందీ వెర్షన్‌కు ఏ ప్లాట్‌ఫామ్ ఖరారవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- Jana Nayagan
తాజావార్తలు
-
AI Data Centre Row: విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు!.. అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్
-
Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!