Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదయింది. తన స్నేహితుడితో ఉన్న వివాదంలో ప్రమేయం ఉందంటూ, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడైన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, తమ ఇద్దరి ఏకాంత సమయాల్లో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని రాహుల్ రెడ్డి బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. దీంతో సదరు యువతి మార్చి 10న విశాఖ సీపీని కలసి ఫిర్యాదు చేసింది.
అలాగే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో రాహుల్ రెడ్డితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మరికొంత మందిపై ఆ యువతి కేసు పెట్టింది. రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు రాహుల్ సిప్లిగంజ్ సహా మరికొందరు తనను బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఎంవీపీ పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా బయటకు వచ్చింది. సదరు యువతి రాహుల్ రెడ్డి నుంచి రూ. 1 కోటి డిమాండ్ చేసిందని ఆ డబ్బు ఇవ్వకపోవడంతోనే కావాలని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు రెండు వైపుల ఆరోపణలపై కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?