హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా…