Governor Tamilisai: రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈకార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొ్న్నారు. పొయ్యి మీద పొంగల్ వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి పొంగల్, ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్,G20 పొంగల్ అంటూ గవర్నర్ తమిళ సై కాంక్షిచారు. హారతి ఇచ్చి హ్యాపీ పొంగల్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రాథించానని తెలిపారు. ప్రజలందరూ.. అందరూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మలక్ పేట్ ఘటన పై స్పందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతున్నానని ఇది నా రిక్వెస్ట్ అన్నారు గవర్నర్. ఒక మహిళ గా, ఒక గైనకాలజిస్ట్ గా సిజేరియన్ చాలా భాధగా ఉంటుందని, అన్నారు.
Read also: ATM Theft: జగిత్యాల జిల్లాలో భారీ చోరీ.. ఏటీఎంలో సీసీ కెమెరాలు మూసేసి రూ.19 లక్షలు..
గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. బేసిక్ నీడ్స్ హాస్పిటల్ లో ఉండాలని తెలిపారు. కొన్ని ఘటనలు జరుగుతున్నాయని, ఇంకా మెరుగుపడాలన్నారు. పెండింగ్ బిల్స్ పై తమిళ సై స్పందించారు. ఆ బిల్స్ పెండింగ్ లో లేవని స్పష్టం చేశారు. కొన్ని అసెస్మెంట్ ఉన్నాయి అంతే అని పేర్కొన్నారు. ప్రధాని ప్రారంభించిన రైల్వేస్ మాకు ఆనందంగా ఉందని తెలిపారు. వోకల్ For లోకల్ అని ప్రస్తావించారు. మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. పెండింగ్ బిల్స్ లో నాన్చి వేత ఏంలేదన్నారు. నిమాయకాల బిల్లు లో UGC నుంచి తెప్పించి కొని చూస్తున్న.. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చెయ్యాలని.. నియామకాలు త్వరగా జరగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు.
BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్‌ఎస్