ZEE Telugu: తెలుగు పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో మరింత ప్రత్యేకంగా మార్చే జీ తెలుగు ఈ సంక్రాంతికి మూడు ముచ్చటైన కార్యక్రామాలతో వినోదం పంచేందుకు సిద్దమైంది. నూతన సంవత్సరాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన జీ తెలుగు తాజాగా కాకినాడలో విక్టరీ వెంకటేష్ అతిథిగా సంక్రాంతి సంబరాలను ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ ఈవెంట్తో వైభవంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ జనవరి 11, శనివారం సాయంత్రం 6 గంటలకు,…
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.
MATA: విదేశాల్లో తెలుగు వారు అత్యంత ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవస్కోటియా ప్రావిన్స్‌లోని హాలీఫ్యాక్స్ నగరంలో మారీటైమ్ తెలుగు అసోసియేషన్(MATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.
Recording Dances: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల అండతోనే ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో బ్రహ్మంగారిమఠం మండలంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. చెంచయ్యగారిపల్లెలో డీజే మాటున మహిళలతో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతుతో గతరాత్రి బహిరంగంగా రికార్డిండ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.…