TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని,…
సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి.
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ…
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్‌రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.…
మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి.
Kite Festival: సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు..
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.
విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు.