Sanju Samson Fans Protest At Thiruvananthapuram: సంజూ శాంసన్‌కి భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై.. అతని అభిమానులు ఎంత అసంతృప్తితో ఉన్నారో అందరికీ తెలిసిందే! వీలు చిక్కినప్పుడల్లా.. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సంజూకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని నిలదీస్తూనే ఉంటారు. ఇప్పుడు భారత జట్టు తిరువనంతపురంలో అడుగుపెట్టగా.. వారి సెగ తగిలింది. ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లు దిగడమే ఆలస్యం.. భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చిన సంజూ శాంసన్ అభిమానులు, ‘సంజూ సంజూ’ అంటూ గట్టిగా…
ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం…
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోన్న భారత్.. ఇది ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఆ సిరీస్‌కు భారత జట్టుని ప్రకటించింది. ఆ జట్టుకి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గానూ, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గానూ నియమించింది. ప్రెజెంట్ దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత్‌కి నాయకత్వ బాధ్యతలు చేపడుతోన్న రిషభ్ పంత్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ జట్టులో సంజూ శాంసన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్లో…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు…
దక్షిణాఫ్రికాతో జూన్‌లో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి గాను బీసీసీఐ సెలెక్షన్ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠిని, సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు, ఏ లెక్కన ఎంపిక చేయలేదని బిసీసీఐని నిలదీస్తున్నారు. మాజీలు సైతం ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయకపోవడంతో నిరాశను వ్యక్తం…
ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిసిన ఢిల్లీ, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన.. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు), పడిక్కల్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో…