మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మురికి కాలువలోని మురికి నీళ్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనాలు తొలుత వాటిని నకిలీ నోట్లుగా భావించారు. కానీ అవి నిజమైన నోట్లే అని తెలిశాక జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. కాలువలోని మొత్తం చెత్తను తొలగించి మరీ రూ.500 నోట్ల కోసం వెతికారు.
పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంత మంది వ్యక్తులు సాధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.