పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యాము ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. గుంపుల మానేరు వద్ద గల చెక్ డ్యాం ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పేల్చివేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్‌తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అవినీతి, అమరావతిలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమ హయాంలో వర్షాకాలం కోసం 80 వేల టన్నుల ఇసుక నిల్వ చేసినప్పటికీ, టీడీపీ…
Sand Mafia: హైదరాబాద్ నగరంలో సాండ్ మాఫియా అక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఇసుక డంప్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 1,100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి మీద కఠిన చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను డెలివరీ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా నిల్వ చేస్తున్న…
Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎ రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అధికారులు ఇసుక రీచ్ ల…
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.