ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు…
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.…
Bihar: బీహార్‌లోని జాముయి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్‌ని తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హోంగార్డుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన జముయ్ లోని మహులియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్‌గా గుర్తించారు. అతని సొంత జిల్లా సవాయ్ కాగా.. గర్హి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఘటన తర్వాత అతనిని…
Sand mafia: మహారాష్ట్రలో ఇసుక మాఫియా బరితెగించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ను హతమర్చే యత్నం చేసింది. ఇసుకతో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను బీడ్ జిల్లా కలెక్టర్ నిలువరించే సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇసుక.. బంగారం కంటే విలువైందిగా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి పారుతున్నా ఇసుకకు ఇబ్బందులు తప్పడంలేదు. కొందరు ఇసుకను అక్రమంగా దాచేసి ఆంధ్ర సరిహద్దుల నుండి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమ నిల్వలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు, రాత్రివేళల్లో ట్రక్కుల కొద్దీ ఇసుక తరాలిపోవడాన్ని చూస్తే సరిహద్దుల్లో అధికారుల పనితీరు విస్మయానికి గురిచేస్తోంది, యటపాక మండలంలో కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తెలంగాణకు తరిస్తున్నారు,…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇసుక సంపదను కర్ణాటకకు చెందిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు… తాజాగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామ అ సమీపంలో ఉన్న కాగ్నానది పరివాహక ఈ ప్రాంతంలో పక్కనే ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు తెలంగాణ ప్రాంతంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న బషీరాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు…