Samajwadi MLA Thrashes BJP Leader's Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.
Azam Khan: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో సివిల్ పోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు భయమేస్తోందని, తనను కూడా అతిక్ అహ్మద్ లాగే కాల్చి చంపుతారని భయపడుతున్నానని అన్నారు. నా నుంచి, మా పిల్లల నుంచి మీకు ఏం కావాలి..?
ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్ కౌంటర్ పై ఉత్తర్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్రంలోని విపక్ష పార్టీలు యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ అంశంపై విపక్ష సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది.
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
Lucknow building collapse: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్ వాదీ ఎమ్మెల్యే షాహీద్ మంజూర్ కొడుకును పోలీసులు నిన్న అర్థరాత్రి మీరట్ లో అదుపులోకి తీసుకున్నారు. లక్నోలని హజ్రత్ గంజ్ వజీర్ హసన్ రోడ్ లోని అలయా అపార్ట్మెంట్ భవనం కుప్పకూలింది. ఈ భవనం ఎస్పీ ఎమ్మెల్యే కొడుకు నవాజీష్, అతని మేనల్లుడికి చెందినది. సుమారు 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి.…
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌర్య నాలుకను చీరేస్తే రూ.51000 రివార్డు ప్రకటించింది.
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని, 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం అన్నారు.