ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్‌వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు..…
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.. ఆదిలోనే అధికార బీజేపీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజకీయ వలసలకు తెరలేపారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. దీంతో షాక్ తిన్న కమల దళం.. తేరుకుని.. అఖిలేష్ ఫ్యామిలీ నుంచి వలసలను ప్రోత్సహించింది.. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఇద్దరికి బీజేపీ కండువా కప్పింది.. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. మొదటగా భారతీయ జనతా…
యూపీలో బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్న వేళ రొటీన్ కి భిన్నంగా జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ త్వరలో బీజేపీ జెండా పట్టుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అర్పనా సింగ్ పోటీ చేశారు. ఆమె బీజేపీ అభ్యర్థి రీటా…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్‌లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు…
త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వలసలు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఒక మంత్రి సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిలేష్ యాదవ్ ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది. Read…
త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ‘ఉచిత’ హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. Read Also:ప్రధాన మంత్రి…
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక,…