Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ "మొసాద్" ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్‌బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్‌తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్,…
కేంద్రం-కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి కేంద్రానికి పిట్రోడా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. ఫిబ్రవరి 1న ఐఐటీ-రాంచీ విద్యార్థులు, అధ్యాపకులతో వర్చువల్‌గా శామ్ పిట్రోడా ప్రసంగిస్తున్నారు.
Sam Pitroda: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల భారతదేశం యొక్క విధానం ఘర్షణాత్మకమైనదని, ఆ మనస్తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు.
Sam Pitroda: ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని’’ భారత్‌లోకి రానివ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ మండిపడుతోంది. గతంలో కూడా సామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
Sam Pitroda: గత కొన్ని వారాలుగా నా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సర్వర్‌లు పదే పదే హ్యాక్ చేశారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ శామ్ పిట్రోడా ఈ రోజు (డిసెంబర్ 7) తెలిపారు.
Sam Pitroda: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్‌కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మేధావి, వ్యూహకర్త అని గాంధీ కుటుంబానికి దీర్ఘకాల సలహాదారుగా ఉన్న శామ్ పిట్రోడా అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కాబోయే ప్రధాని కావడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ బుధవారం తిరిగి నియమించింది. పిట్రోడా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.