Sam Pitroda: గత కొన్ని వారాలుగా నా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సర్వర్‌లు పదే పదే హ్యాక్ చేశారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ శామ్ పిట్రోడా ఈ రోజు (డిసెంబర్ 7) తెలిపారు. ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీలో 10 వేల డాలర్లు చెల్లించకపోతే.. తన ప్రతిష్టను దిగజార్చేస్తారని హ్యాకర్లు హెచ్చరించారని ఆయన అన్నారు. నా పేరుతో వచ్చే ఏవైనా లింక్‌లు వస్తే క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు.
Read Also: Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం
ఇక, నా గురించి ఏవైనా ఈ-మెయిల్‌లు లేదా సందేశాలు వస్తే మాత్రం.. వాటిని తెరవవద్దు, అలా చేస్తే మీ పర్సనాల్ డేటాను హ్యాకర్లు దోచేస్తారని కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ ప్రిటోడా తెలిపారు. చికాగోకు తిరిగి వచ్చిన తర్వాత తక్షణ చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. నా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తానని చెప్పుకొచ్చారు. నా పర్సనల్ సమాచారాన్ని కాపాడుకోవడానికి పటిష్టమైన కొత్త భద్రతా చర్యలను తీసుకుంటానని తెలిపారు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడిన, అసౌకర్యానికి గురైన వారికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని శ్యామ్ పిట్రోడా చెప్పారు.