కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మేధావి, వ్యూహకర్త అని గాంధీ కుటుంబానికి దీర్ఘకాల సలహాదారుగా ఉన్న శామ్ పిట్రోడా అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కాబోయే ప్రధాని కావడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల్లో దేశానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ వ్యాఖ్యలను భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా ఖండించారు. అమెరికా పర్యటన గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8-10 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారన్నారు. వ్యక్తిగత స్థాయిలో క్యాపిటల్ హిల్‌లో వివిధ వ్యక్తులతో సంభాషిస్తానని పిట్రోడా చెప్పారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రెస్ క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారని పిట్రోడా తెలిపారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి కూడా వెళ్తారని స్పష్టం చేశారు.
READ MORE: Devara Daavudi: అనిరుధ్ ఆగాయా… టైగర్ ఫ్యాన్స్‌కు ఫెస్ట్ మిల్ గయా!
రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలపై పిట్రోడా ఏమన్నారు?
రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీల మధ్య ఉన్న సారూప్యతలు, విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు పిట్రోడా సమాధానమిచ్చారు. తాను చాలా మంది ప్రధాన మంత్రులతో చాలా సన్నిహితంగా పనిచేశానని చెప్పారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ వంటి వారతో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తుచేశారు. కానీ రాహుల్, రాజీవ్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. రాహుల్ మేధావి, ఆలోచనాపరుడు అన్నారు. అయితే రాజీవ్ కొంచెం ఎక్కువగా పనిచేస్తారన్నారు. ఇద్దరికీ ఒకే డీఎన్ఏ అని.. మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనే వారి లక్ష్యమన్నారు.