పాత్ర నచ్చితే చాలు “ఊ…” అనడమే తెలుసు, “ఊహూ…” అని మాత్రం అనరు. అదీ సమంత బాణీ! అందం, చందం, అభినయం అన్నీ కుదిరిన సమంత తనదైన పంథాలో పయనిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ‘మహానటి’లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు.…