కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆయన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా హిందూత్వాన్ని ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సల్మాన్ ఖుర్షీద్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు నైనిటాల్‌లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆయన ఇంటి అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు. అయితే దుండగులు తన ఇంటిపై దాడి చేసిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: కుమారుడి పెళ్లి కోసం రోడ్డు వేయించిన తండ్రి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇది హిందూయిజం కానే కాదు అనడానికి ఈ విధ్వంసమే ఉదాహరణ అని సల్మాన్ ఖుర్షీద్ సదరు పోస్టులో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని ఈ దాడి ఘటనే చెబుతోందని వివరించారు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుపడేలా ఈ చర్య ఉందన్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో ఒక వీడియోలో కొందరు బీజేపీ జెండా ఊపుతూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. దేశం పట్ల తనకున్న విజన్‌ను గర్వించదగ్గ రీతిలో అంతర్జాతీయ వేదికలపైనా చాటిన రాజనీతిజ్ఞుడు సల్మాన్ ఖుర్షీద్ అని పేర్కొన్నారు. రాజకీయ అసహనంతో ఇలా దాడులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
This is disgraceful. @salman7khurshid is a statesman who has done India proud in international forums &always articulated a moderate, centrist, inclusive vision of the country domestically. The mounting levels of intolerance in our politics should be denounced by those in power. https://t.co/OQFBoN1Pgw
— Shashi Tharoor (@ShashiTharoor) November 15, 2021
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!