బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి సగటు సినిమా ప్రేక్షకుడు సైతం పెదవి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావనే అత్యధికశాతం మంది సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాలలో థియేటర్లలోనూ, పలు దేశాల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలోనూ ఈ సినిమాను చూసే అవకాశం నిర్మాతలు కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో యాపిల్ టీవీ…
బాలీవుడ్ బిగ్ స్టార్స్ కి కరోనా లాక్ డౌన్స్ బలమైన పాఠాల్నే నేర్పుతున్నాయి. పోయిన ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ సహా చాలా మంచి స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ వేదికలపైకి వచ్చేశారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేయటమే బెటర్ అని బాలీవుడ్ భావించింది. అయితే, 2020 తరువాత 2021లో కూడా కరోనా ఇంకా షాకిస్తూనే ఉంది. అందుకే, మళ్లీ బాలీవుడ్ కి ఓటీటీ బాట…
ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ రాథే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైరసీ చేయడంపై హీరో, నిర్మాత సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజనబుల్ గా రూ. 249 రూపాయలకే తమ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ తమ చిత్రాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచడం దారుణమని సల్మాన్…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా…
బాలీవుడ్ బడా ఖాన్ సల్మాన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. దిశా పటాని హీరోయిన్. ముంబై క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ల రిలీజ్ తో పాటు నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్ సినిమా కావడంతో తొలి రోజున సూపర్ రెస్పాన్స్ తో స్ర్టీమ్ అయింది. అయితే ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలిన బ్యాయ్ కాట్ సెగ ఈ చిత్రానికి కూడా తగిలింది.…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. ‘రాధే’లో సల్మాన్ ఖాన్తో పాటు, రాధే దిషా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 13 న ఇండియా సహా 40కి పైగా దేశాలలో థియేట్రికల్ గా విడుదలైంది. ఇండియాలో ఈ చిత్రం ZEE5 లో పే పర్ వ్యూ బేస్ లో విడుదలైంది.…
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రేపు అంటే మే 13న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కు ముందు సల్మాన్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జీ 5 లో ‘రాధే’ను చూడండి. వినోదంలో పైరసీ చేయవద్దని అని చెప్పారు. పైరసీని అంతం చేస్తామని, ‘రాధే’ను చేయాల్సిన విధంగానే చూస్తామని కమిట్మెంట్ ఇద్దాము ఒక సినిమాను చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడతారు. కానీ కొంతమంది…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రత్యేకించి పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. అవుతున్నారు. చిత్రపరిశ్రమ దాదాపుగా మూత పడింది. నార్త్ నుంచి సౌత్ వరకూ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్థంబించి పోయింది. తెరిచి ఉన్న అర కొర థియేటర్లలో సినిమాలు నడుస్తున్నా…. ప్రేక్షకులు కరువవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతా ధైర్యం చేయటం లేదు. అయితే…
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సల్మాన్ ఓ ప్రముఖ మీడియాతో ప్రస్తావించారు. సల్మాన్ మాట్లాడుతూ “నా సోదరి అర్పితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. ఇంతకు ముందు ఎవరెవరికో కరోనా వచ్చిందని మేము విన్నాము. కానీ ఈసారి మా కుటుంబంలో కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు మా ఇంటి డ్రైవర్లకు కరోనా సోకింది. కానీ ఈసారి అది చాలా మందికి…