సూపర్ సక్సెస్ వస్తే ఎవరికైనా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది! కానీ, ఆ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ రాక ముందే గాల్లో తేలిపోతున్నారు. ఒకరు ఖిలాడీ అక్షయ్ కుమార్ కాగా… మరొకరు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్. వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చేయటానికి ఆకాశంలోకి దూసుకుపోయారు.
‘సూర్యవంశీ’ సినిమాలో అక్కీ హెలికాప్టర్ నుంచీ వేలాడతాడని ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కెరీర్ మొదట్నుంచీ ఇలాంటి పనులు చేయటంలో దిట్ట అయిన మన ‘ఇంటర్నేషనల్ ఖిలాడీ’ మరోసారి మాస్ అభిమానుల్ని ఈలలు వేయించనున్నాడు. మరోవైపు సల్మాన్ కూడా ‘పఠాన్’ సినిమాలో హెలికాప్టర్ ఎక్కనున్నాడు! సారీ, హెలికాప్టర్ నుంచీ దిగనున్నాడు. షారుఖ్ ఖాన్ స్టారర్ ‘పఠాన్’ కోసం గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోన్న సల్లూ భాయ్ హెలికాప్టర్ నుంచీ గాల్లో వేలాడుతూ తెర మీద ఎంట్రీ ఇస్తాడట! ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో పెద్ద చర్చకి కారణమైంది.
అక్షయ్ ‘సూర్యవంశీ’లో హెలికాప్టర్ స్టంట్ కి సై అన్నాడు. సల్మాన్ కూడా ‘పఠాన్’ కోసం గాల్లో రిస్క్ చేశాడు! ఎవర్నీ ఎక్కువగా ఆడియన్స్ ఆదరిస్తారు? ఎవరికి ఎక్కువగా ఈలలు మోగుతాయి? తెలియాలంటే, కొన్నాళ్లు ఆగాల్సిందే. మొదట అక్షయ్ ‘సూర్యవంశీ’, తరువాత సల్మాన్ అతిథి పాత్రలో షారఖ్, దీపికా స్టారర్ ‘పఠాన్’ రానున్నాయి!