ఒకరు కత్తిని సర్జరీకి వాడితే… మరొకడు మర్డర్ చేయటానికి ఉపయోగించవచ్చు! టెక్నాలజీ కూడా అంతే! వాట్సప్ ని అందరూ మెసెజెస్ పంపటానికి వాడితే కొందరు మాత్రం సినిమాల పైరసీకి వాడేస్తున్నారు. వాట్సప్ తో పాటూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని కూడా పైరసీగాళ్లు తెగ యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు తలనొప్పిగా మారింది. మే 13న ఈద్ సందర్భంగా ఆయన నటించిన ‘రాధే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్ లో మాత్రమే రిలీజైన ఈ సినిమా ‘జీ ప్లెక్స్’లో పే పర్ వ్యూ లెక్కన చూడాలి. కానీ, కొందరు పైరసీ వర్షన్ ని వాట్సప్ లో చక్కర్లు కొట్టిస్తున్నారు. అలా షేర్ చేసిన వార్ని వదిలేది అంటూ ఆ మధ్య సల్మాన్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఢిల్లీ హైకోర్ట్ వాట్సప్ ని కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. ‘రాధే’ సినిమా సర్క్యులేట్ చేస్తున్న అకౌంట్లని సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇప్పటికైనా కేటుగాళ్లు కంట్రోల్ అవుతారో లేదో ఇంకా ఏదైనా దొంగ మార్గం ఎంచుకుంటారో చూడాలి! పైరసీ అరికట్టలేకపోతే మాత్రం లాక్ డౌన్ కాలంలో థియేటర్లు లేక తిప్పలు పడుతోన్న సినీ పరిశ్రమకి ఆన్ లైన్ లో అవస్థలు తప్పవు…