నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన…
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు…
సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’ టూర్ కోసం కొన్ని రోజుల క్రితం రియాద్‌కు బయలు దేరాడు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇస్తారు. ఈ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. ఈ లైవ్ కాన్సర్ట్‌లో అంతర్జాతీయ వేదికపై సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ తారలు కనిపిస్తారు. సల్మాన్ సన్నిహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ పర్యటనలో చేరనున్నారు. అయితే ఈ నటి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మధ్యలో ఉంది. గత…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో సందడి చేశారు. ఆయన నటించిన అంతిమ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేపీహెచ్‌బీలోని సుజనా ఫోరమ్ మాల్‌కు సల్మాన్ విచ్చేశారు. అయితే సల్మాన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఒక్కసారిగా మాల్ ప్రాంగంణం కిక్కిరిసిపోయింది. అయితే సల్మాన్ ఖాన్ అంతిమ్ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయుష్ శర్మ నటించారు. ఈ మూవీ గత నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…
సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
సినిమా ప్రపంచంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇక ఇటీవల ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘యాంటీమ్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన…
బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లి వేడుక దగ్గర్లో ఉండగానే.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి కూతురుగా కనిపించబోతుందట.. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా రాబోతుందట. వీరిద్దరూ కలిసి ‘దబాంగ్’ లో…
హీరోయిన్లు సాధారణంగానే మేకప్ వల్ల అందంగా కన్పిస్తారు. కానీ కొంతమంది మరింత అందంగా తయారవ్వడానికి మేకప్ మాత్రమే కాదు సర్జరీలను కూడా ఆశ్రయిస్తారు. అయితే అందులో కొంతమంది అంతం మెరుగుపడుతుంది. మరికొంత మందికి మాత్రం ఉన్న అందం చెడిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా తమ అందాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరిపోయింది అంటున్నారు. బార్బీ బొమ్మలా అందంగా ఉండే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది. శుక్రవారం ముంబైలో…