2022 డిసెంబర్ 27న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఆయనకు మరో రెండ్రోజుల్లో 56 ఏళ్లు నిండుతాయి. అయితే ఈ బీటౌన్ సూపర్ స్టార్ మన సౌత్ స్టార్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్”ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్‌లతో సహా సినిమాలోని ప్రధాన తారాగణం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ 15″కి హాజరయ్యారు.
ఈ షో వేదికగా సల్మాన్ భాయ్ తన పుట్టినరోజును ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో జరుపుకున్నారు. ‘బిగ్ బాస్’ వేదికపైనే ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఉండగా భాయ్ కేక్ కట్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో సల్మాన్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో హంగామా చేశాడు. తారక్, చరణ్‌లతో కలిసి ‘నాచో నాచో’ అంటూ ఊర మాస్ డ్యాన్స్ చేశాడు. ‘భజరంగీ భాయిజాన్’ స్టార్ తమ రాబోయే ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేస్తానని అలియా భట్‌కి హామీ ఇచ్చారు. సల్మాన్, అలియా ‘ఇన్షాల్లా’లో కలిసి నటిస్తున్నారు. ‘బిగ్ బాస్ 15’ ఈ ప్రత్యేక ఎపిసోడ్ కలర్స్ టీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతుంది.