రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తోంది.
ఇక తాజాగా ఈ వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ స్టేజిపై సల్మాన్ మాట్లాడుతున్న ఫోటోను మేకర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఈవెంట్ మొత్తాన్ని స్టార్ ప్లస్ వారు పెద్దమొత్తంలో కొనుగోలు చేశారట. ప్రత్యేక సందర్బంలో టెలికాస్ట్ చేయడం కోసం హోల్ట్ లో పెట్టారట. మరి ఏ సందర్బాల్లో ఈ ఈవెంట్ ని రిలీజ్ చేస్తారో చూడాలి.