బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందని తెలిపారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చరణ్ ఏ హీరో కోసం గెస్ట్‌గా మారనున్నాడు.. బాలీవుడ్ ప్లాన్ నిజమేనా..! గతంలో ఓ సారి బాలీవుడ్లో సినిమా చేసి..…
ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్‌ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా…
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్…
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్గా.. నాని హీరోగా నటించిన ‘అంటే…
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. నటుడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు లేఖను అందించిన వ్యక్తులను ముంబై పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితుడు సిద్ధేష్ హిరామన్ కాంబ్లే అలియాస్ మహాకల్‌ను విచారించిన సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. బిష్ణోయ్ సహాయకుడు విక్రమ్ బరాద్ లేఖను సలీంఖాన్‌కు ఇచ్చినట్లు నిందితుడు మహాకల్ వెల్లడించాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్…
ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల లేఖ వచ్చిన విషయం తెలిసిందే! పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని ఎలా కాల్చి చంపామో.. అలాగే నిన్ను, నీ తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ అతనికి లేఖ వచ్చింది. ఈ లేఖ అందుకున్న వెంటనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనికి భద్రత పెంచడంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్నిరోజులు ఈ లేఖపై స్పందించని సల్మాన్.. తాజాగా ఓపెన్ అయ్యాడు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబై గ్యాంగ్ స్టార్ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో సల్లు భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాల్లో సగభాగం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ రామోజీ…
కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో…